సాలూరులో దీప్తి స్కూల్ సత్తా… టౌన్ ఫస్ట్‌గా విద్యార్థుల రికార్డు మార్కులు!
Featured Latest- Est 1 min
- 0 Views
- 2 weeks ago
బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.!
Featured Latest Popular- Est 1 min
- 0 Views
- 1 month ago
సాలూరులో ప్రమాదాల నివారణకు సంయుక్త తనిఖీలు – కీలక నిర్ణయాలు
Featured Latest Popular- Est 1 min
- 0 Views
- 1 month ago
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం
Featured Latest Popular- Est 0 min
- 0 Views
- 2 months ago
టీటీడి శ్రీ వేంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు తిరుపతి ఎమ్మెల్యే అరణి శ్రీనివాసులు రూ.10 లక్షలు విరాళం అందించారు
Featured Latest Popular- Est 0 min
- 0 Views
- 2 months ago
తెలుగు రాష్ట్రాల మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు
Featured Latest Popular- Est 0 min
- 0 Views
- 2 months ago
ఎమ్మెల్యే చొరవతో జూనియర్ కళాశాల స్థలం సమస్య పరిష్కారం
Featured Latest Popular- Est 1 min
- 0 Views
- 2 months ago
Top 10 News
సాలూరులో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్
సాలూరులో దీప్తి స్కూల్ సత్తా… టౌన్ ఫస్ట్‌గా విద్యార్థుల రికార్డు మార్కులు!
బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.!
సాలూరులో ప్రమాదాల నివారణకు సంయుక్త తనిఖీలు – కీలక నిర్ణయాలు
సాలూరులో శాంతి భద్రతలపై పోలీసుల కఠిన చర్యలు
పల్లె ప్రాంతాల ప్రగతే కూటమి ప్రభుత్వ ధ్యేయం
ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం
తెలుగు రాష్ట్రాల మెడికల్ పీజీ సీట్ల భర్తీ.. సుప్రీంకోర్టుకు కాలేజీలు
Sport
News
Recent
Posts
సాలూరులో ట్రాఫిక్ నిబంధనలపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

హెల్మెట్, ఓవర్‌లోడింగ్‌పై అవగాహన – నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కేసులుసాలూరు, మే 8: సాలూరు పట్టణ పరిధిలో ఈ రోజు సాలూరు టౌన్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమంతో పాటు విస్తృత వాహన తనిఖీలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా చేపట్టిన ఈ కార్యక్రమంలో ద్విచక్ర వాహనదారులకు హెల్మెట్ ధరించడం తప్పనిసరి అని అవగాహన కల్పించారు. డ్రైవర్‌తో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించాలని సూచించారు.అలాగే ఓవర్లోడింగ్ వల్ల జరిగే ప్రమాదాల గురించి వివరించిన పోలీసులు, ఆటో రిక్షాలు మరియు ఇతర వాహనాల్లో అనుమతించిన సంఖ్యకన్నా ఎక్కువ మందిని ఎక్కించరాదని హెచ్చరించారు. పట్టణంలోని ప్రధాన కూడళ్ల వద్ద వాహన తనిఖీలు నిర్వహించి, హెల్మెట్ లేకుండా ప్రయాణించడం, ట్రిపుల్ రైడింగ్, ఓవర్లోడింగ్ మరియు ఇతర ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై మోటార్ వెహికిల్స్ యాక్ట్ ప్రకారం కేసులు నమోదు చేశారు.మహిళల భద్రతపై కూడా పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మహిళలు, విద్యార్థినులు రాత్రి వేళల్లో నిర్మానుష్య ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణించరాదని, తమ ప్రయాణ వివరాలను కుటుంబ సభ్యులకు తెలియజేయాలని సూచించారు. వేధింపులు ఎదురైన సందర్భాల్లో వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని, అత్యవసర పరిస్థితుల్లో 100/112 నంబర్లకు కాల్ చేయాలని తెలిపారు.ప్రజలు ట్రాఫిక్ నియమాలను పాటిస్తూ పోలీసులకు సహకరించి సురక్షితమైన సాలూరు నిర్మాణంలో భాగస్వాములు కావాలని సాలూరు టౌన్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ కోరారు.
సాలూరులో దీప్తి స్కూల్ సత్తా… టౌన్ ఫస్ట్‌గా విద్యార్థుల రికార్డు మార్కులు!

పార్వతీపురం జిల్లా సాలూరు పట్టణంలోని దీప్తి ఇంగ్లీష్ మీడియం స్కూల్ మరోసారి ప్రతిభను చాటుకుంది. ఈ సంవత్సరం పదో తరగతి ఫలితాల్లో విద్యార్థులు అద్భుతమైన మార్కులు సాధించి, పట్టణంలో ఫస్ట్‌గా నిలిచారు.స్కూల్‌కు చెందిన విద్యార్థులు 594, 592, 591, 590 మార్కులు సాధించి అత్యున్నత ఫలితాలు నమోదు చేశారు.Ch.ఇందు వర్షిణి 594 మార్కులతో టాప్‌లో నిలవగా, సాయి కౌశిక్ నాయుడు 592, వి. చరిష్మ 591, డి. హేమ వర్షిణి 590 మార్కులు సాధించి ప్రతిభ కనబర్చారు.విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల మార్గదర్శకత్వం, తల్లిదండ్రుల సహకారం వల్లే ఈ విజయం సాధ్యమైందని పాఠశాల యాజమాన్యం తెలిపింది. ఈ విజయంపై స్థానికులు, తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తూ విద్యార్థులను అభినందిస్తున్నారు.
బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.!

బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి.!
బొబ్బిలి ఎమ్మెల్యే- బేబీ నాయన కు వినతి..!
బొబ్బిలి నాన్ అక్రిడేషన్ సంఘ అధ్యక్షులు – సునీల్ కుమార్.!
విజయనగరం జిల్లా బొబ్బిలి 07
బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ మంగళవారం బొబ్బిలి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆర్ వి ఎస్ కే రంగారావు (బేబీ నాయన) కు ఆ సంఘ అధ్యక్షులు కాగాన, సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు, అక్కేరేపు, అప్పారావు, కార్యదర్శి, కురమాన, రామకృష్ణ, కోశాధికారి, ఎన్.వి, నాయుడు, సలహాదారులు మురళి లా ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని ఆయనకు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బొబ్బిలి నియోజకవర్గంలో నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల కమిటీని నూతనంగా ఏర్పాటు చేశామని, జర్నలిస్టుల సమస్యలలో ముఖ్యమైనది బొబ్బిలి ప్రెస్ క్లబ్ నిర్మాణానికి స్థలం మంజూరు చేయాలని వారు కోరారు. జర్నలిస్టులు ప్రజా సేవకై నిరంతరము సమాచారాన్ని వార్తలను సేకరించి, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోవడానికి బొబ్బిలి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ అయినా బొబ్బిలిలో ఇంతవరకు “బొబ్బిలి” ప్రెస్ క్లబ్” నిర్మాణానికి, ఎలాంటి, ప్రజా ప్రతినిధులు గాని, అధికారులు గానీ సహకరించలేదని వారు అన్నారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఉన్న కూటమి ప్రభుత్వం ఎమ్మెల్యే బేబీ నాయన అయినా బొబ్బిలి నాన్ అక్రిడేషన్ జర్నలిస్టుల కమిటీ తరఫున “బొబ్బిలి ప్రెస్ క్లబ్” నిర్మాణానికి స్థలాన్ని మంజూరు చేసి నిర్మాణం చేసుకోడానికి సహాయ సహకారాలు అందిస్తారని ఈ సందర్భంగా వారు కోరారు. అనంతరం బొబ్బిలి పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్,
కె, నారాయణరావు ను మరియు బొబ్బిలి తహసిల్దార్ ఎం, శ్రీను, అలాగే ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్, ఎస్,ఐ, శ్రావణ్ కుమార్, మండల అభివృద్ధి అధికారి రవి కుమార్,ను మర్యాదపూర్వకంగా కలిసి బొబ్బిలిలో నూతనంగా ఏర్పాటు చేసిన బొబ్బిలి నాన్ అక్రిడేషన్”
జర్నలిస్టుల సంఘానికి ప్రజా ప్రతినిధులు, అధికారులు ఎల్లవేళలా సహాయ సహకారాలు అందించి మీ ద్వారా ప్రజల కు తెలియజేయవలసిన వార్తా సమాచారాన్ని ఎల్లప్పుడూ వారికి తెలియజేస్తూ ప్రజా సమస్యలను అధికారులకు ప్రజా ప్రతినిధులకు నిరంతరం అందించడంలో తమ వంతు కృషి చేస్తామని ఆ సంఘ అధ్యక్షులు సునీల్ కుమార్, ఉపాధ్యక్షులు అక్కేరేపు, అప్పారావు, కార్యదర్శి, కురమాన, రామకృష్ణ, కోశాధికారి ఎం,వి, నాయుడు, సలహాదారులు మురళి, ఈ సందర్భంగా అధికారులకు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బొద్దాన శ్రీనివాసరావు, పొలుబోతు అమర్నాధ్, కోట శ్రీనివాసరావు, బేత సురేష్, రామకృష్ణ,(చంటి) మురళి, మూర్తి, మాస్టారు, పాతిరెడ్డి హరి, విజయ్, సి,హెచ్, శ్రీనివాసరావు, కిషోర్, బొబ్బిలి గణేష్, మహేష్, శ్రీనివాస్, జామి సీతారాం, సతీష్, దొరబాబు, తదితరులు పాల్గొన్నారు.

